ఈ హీరో సినిమాలన్నీ చాలా జాగ్రత్తగా చేసుకుపోతుంటాడు. క్వాలిటీ లేని సినిమాలను ఒప్పుకోడు కూడా కథలో పస లేనిదే ఏ సినిమాలైన ఏం సక్సెస్ అవుతాయి. అలాంటిది మరిప్పుడు ఏకంగా ఏడు సినిమాలకు ఎలా ఒప్పుకున్నాడబ్బా నారా రోహిత్. సంవత్సరానికి ఒకటి రెండు సినిమాలు చేయడమే గగనమై పోయింది. పాత హీరోలు నెలకో సినిమా చేసి పడేశారు. ఇప్పుడలా చేస్తే ఎవరు చూస్తారు. ఈ హీరోగారి ఆ ఏడు సినిమాలేమిటో చూద్దాం... శంకర అనే సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉండగా 'సావిత్రి ', 'అప్పట్లో ఒకడుండేవాడు ', 'పండుగలా వచ్చాడు 'చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇవన్నీ చేతిలో ఉండగానే... మరో రెండు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. సాయి కొర్రపాటి నిర్మాణంలో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక చిత్రం ,శ్రీను వైట్ల శిష్యుడు ప్రదీప్ దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి ఒకే చెప్పాడు . ఇవి చాలవన్నట్టు మరో రెండు, మూడు ప్రాజెక్ట్ లు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. కాల్షీట్ల చిక్కులు వస్తాయేమో హీరోగారికి. అయినా డేర్ చేస్తున్నాడే... ఈ హీరో.