‘విలేజ్ లో వినాయకుడు’, ‘భీమిలీ కబడ్డీ జట్టు’ చిత్రాలలో నటించిన అమ్మాయి గుర్తుందిగా... మన పక్కింటి అమ్మాయిలా... చూడగానే గౌరవ భావం కలిగే హీరోయిన్ శరణ్య మోహన్. ఈ అమ్మాయి త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. శరణ్య నిశ్చితార్థం డెంటిస్ట్ డాక్టర్ అరవింద్ కృష్ణన్ తో జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా శరణ్య తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో శరణ్య నటించినప్పటికీ.. కేవలం నటనకేగానీ గ్లామర్ జోలికి వెళ్ళ లేదు. చక్కని కట్టుబొట్టుతో... పదహారణాల తెలుగమ్మాయిలా కనిపించింది. సినిమా ఛాన్సుల కోసం ఎగబడకుండా తనకు తగిన పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది. ఇక త్వరలోనే పెళ్లి చేసుకొని సినిమాలకు స్వస్తి పలుకనుంది. నిశ్చితార్థం తెపింది కానీ పెళ్ళి ఎప్పుడో తెలియజేయలేదు శరణ్య. త్వరలో ఆ విషయాలు కూడా తెలుపుతుందేమో వెయిట్ చేద్దాం....