బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ బాలీవుడ్ రంగ ప్రవేశం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. హాలీవుడ్ లో ఘనవిజయం సాధించి, అస్కార్ పొందిన ‘బాయ్ హుడ్’ తో పరిచయం కాబోతున్నట్లు సమాచారం. లండన్ లో ఈ చిత్రాన్ని చూసిన ఆర్యన్ కు బాగా నచ్చిందట. దీంతో తండ్రి షారూక్ కు ఫోన్ చేసి ఆ సినిమాను చూడమని చెప్పాడట. అంతేకాదు ఆ చిత్రం రీమేక్ చేయాలని అందులో తాను నటించాలని అనుకుంటున్నట్లు తండ్రికి చెప్పాడని కుటుంబ దగ్గరి వ్యక్తుల సమాచారం. అందుకు కింగ్ ఖాన్ కూడా సుముఖంగా ఉన్నాడని, తానే ఆ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని, కొడుకుని హీరోగా పెట్టి తానే నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలో ఆ చిత్ర నిర్మాతలతో ఫోన్ లో సంప్రదింపులు జరిపాడని తెలుస్తోంది. హాలీవుడ్ లో రిచర్డ్ లింక్లాటర్ దర్శకత్వంలో 12 ఏళ్లపాటు ఈ చిత్రం రూపొందింది. ఇందులో ఎల్లర్ కాల్ట్రేన్ నటించాడు.