యంగ్ హీరో శర్వానంద్ ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చిత్రాలతో రెండు వరుస సక్సెస్ లు అందుకున్నాడు. మరోసారి యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో సక్సెస్ కొట్టిన మేర్లపాక గాంధీ దర్శకత్వలో సినిమాచేయడానికి సిద్ధమవుతున్నాడు. సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమాకి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనుంది.