ఫ్లాప్ డైరక్టర్ తో సినిమా ఏంటి రాజా?

April 22, 2016 | 05:34 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sharwanand-karunakaran-niharonline

వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ హ్యాట్రిక్ కొట్టడంతోపాటు నిర్మాతలకు కల్ఫవృక్షంగా మారిపోయాడు శర్వానంద్. సంక్రాంతి ఎక్స్ ప్రెస్ రాజాతో కామెడీ హిట్ కొట్టి ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుకు రెడీ అయిపోతున్నాడు. 25వ చిత్రం కావటంతో కాస్త శ్రద్ధకనబరిచి మంచి సబ్జెక్టు ఎంచుకోవటానికి ఇన్నాళ్లు ఆగాడు. ఛత్రపతి, అత్తారింటికి దారేది,  నాన్నకు ప్రేమతో చిత్రాలను అందించిన నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ బ్యానర్ లో ఈ చిత్రం ఉండబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే అది ఎవరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందనే ఆసక్తి యూత్ లో మొదలైంది.

                                          తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం  ప్రేమ చిత్రాల స్పెషలిస్ట్ కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే కరుణాకరణ్ కు గత కొద్ది కాలంగా హిట్లు లేవు. డార్లింగ్ తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా ఆడినప్పటికీ అది అంత పెద్ద విజయం కాదు. చివరి చిత్రం చిన్నదాన నీకోసం కూడా బిలో యావరేజ్ చిత్రం. మరి అలాంటి దర్శకుడితో సినిమా ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రేక్షకులకి కావలసినది కథలో కొత్తదనమే. కథలో కొత్తదనముంటే సహజంగానే దాని వెనుక విజయం వచ్చేస్తుంది అని నమ్మే శర్వా కరుణాకరన్ చెప్పిన కథ నచ్చటంతో ఓకే చెప్పినట్లు సమాచారం. రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమా మే మొదటి వారంలో పట్టాలెక్కనుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ