శేషాచలం ఎన్ కౌంటర్ కథతో తమిళ చిత్రం

April 30, 2015 | 04:53 PM | 150 Views
ప్రింట్ కామెంట్
tamil_movie_on_sheshachalam_encounter_niharonline

సినిమా వాళ్ళు మంచి కథల కోసం ఎప్పుడూ ఎదురు చూస్తుంటారు. చిన్న సంఘటన ఆధారంగా చక్కని కథలు కూడా అల్లేస్తుంటారు.  ఏ సంఘటననూ వదలకుండా సినిమాలు తీయడానికిరెడీ అయి పోతుంటారు. ఈ మధ్య జరుగుతున్న సంఘటనలను సినిమాలు తీయడానికి పరుగులు తీస్తున్నారు కూడా. ముందుగా ఎవరు కథ రెడీ చేసుకుంటే కాసుల పంట వారిదే. ఇప్పుడు అలాంటి దే ఓ కథ తయారవుతోంది. సంచలనం సృష్టించిన శేషాచలం ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో తమిళంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  'తూకు మారా పోకల్‌' పేరుతో రూపొందుతున్నఈ చిత్రానికి కాళిదాస్‌, ఆగస్టిన్‌ దర్శకత్వం వహించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసుల దుశ్చర్యకు  నిదర్శనంగా బలైన 20 మంది తమిళుల ఆవేదనను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ఎన్‌కౌంటర్‌ వెనుక దాగున్న అసలు నిజాలను చిత్రంలో చూపిస్తామన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, శేషాచల అడవుల నుంచి ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న 20 మంది కూలీలను ఇటీవల ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. జయవిజయ చాముండేశ్వరి ప్రొడక్షన్స్‌, స్కాట్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. 'క్రైం మన్నన్‌'గా గుర్తింపు తెచ్చుకున్న కథారచయిత రాజేష్‌కుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి సునిల్‌ గ్జేవియర్‌ సంగీతం అందించారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతంలో చిత్రీకరణ జరిపేందుకు చిత్రయూనిట్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో చిత్ర తారాగణం గురించి వెల్లడిస్తామని దర్శకుడు వి.ఆర్‌.కాళిదాసు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ