ప్రస్తుతం శృతీహాసన్ చేతిలో తెలుగు సినిమాలు ఏం లేవు. మహేష్ మురగదాస్ చిత్రంపై నమ్మకంతో వేరే ఏ చిత్రాలను అంగీకరించడం లేదు. అయితే ఆరు నెలలపాటు ఖాళీగా ఉండటం ఎందుకు అనుకుందో ఏమో సడన్ గా ఇప్పుడు మనసు మార్చుకుందట. ముందుగా తమిళ్ సూపర్ హిట్ తని ఒరువన్ రీమేక్ లో చరణ్ కి జోడిగా నటించనుందని వార్తలు వినవచ్చాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా ఈ చిత్రం డిసెంబర్ నుంచి షూటింగ్ జరుపుకోనున్నట్లు ప్రకటించారు.
అయితే ఏం జరిగిందో ఇప్పుడు తెలీదుగానీ ఆ ప్రాజెక్టు ఆమె డ్రాప్ అయినట్లు సమాచారం. అయితే అదే టైంలో నాగ చైతన్య కథానాయికుడిగా తెరకెక్కకున్న ప్రేమమ్ రీమేక్ లో ఓకే చెప్పిందని తెలుస్తోంది. దీనికి శృతీ చెప్పే కారణాలు వేరేలా ఉన్నాయి. తాను ముందుగా ప్రేమమ్ రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం వల్లే చరణ్ సినిమా నుంచి తప్పుకున్నట్లు చెబుతోందట. దాంతో మరో కథానాయిక అన్వేషణలో తని ఒరువన్ టీమ్ నిమగ్నమైనట్టు తెలుస్తోంది. అయితే అల్రెడీ చరణ్ తో శృతీ ఎవడులో జత కట్టింది. మళ్లీ ఎందుకు అనుకుందో మరీ ఈసారి చాన్స్ నాగచైతన్యకి ఇచ్చిందని అంటున్నారు. మరోపక్క ప్రేమమ్ లో హీరోయిన్ పాత్రకి చాలా ప్రాధాన్యం ఉండటంతోనే ఆమె వెంటనే అంగీకరించిందని తెలుస్తోంది. మరి శృతి తప్పుకోవటంతో చరణ్ జోడీకట్టే ఛాన్స్ ఏ కథానాయికకు దొరుకుతుందో లెట్ సీ.