సూపర్ స్టార్ మహేష్ బాబు మిర్చి డైరక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలె ఈ చిత్రం పూణేలో చిత్రీకరణ ప్రారంభమయ్యింది. మహేష్, శృతిహాసన్ లపై కొన్ని సన్నివేశాలు, ఓ పాటను తెరకెక్కించారు కూడా. అయితే ఇప్పుడో వార్త అభిమానులను షాక్ కు గురిచేసింది. కాల్షీట్ సమస్యతో ఈ చిత్రం నుంచి శృతిహాసన్ తప్పుకుందనే వార్త ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తుంది. తమిళ్ హీరో విజయ్ తోచేస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం కోసం మహేష్ చిత్ర షూటింగ్ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయిందని ఇటీవల టాక్ వినిపించింది. దీంతో ప్రాజెక్టు నుంచి శృతిహాసన్ ను తప్పించాలని డిసైడ్ అయ్యారంటా. ఇక ఇందులో సమంతను హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసుకున్నారట. దీనికి సంబంధించి సమంతతో నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే శృతి కాల్షీట్ కారణంగానే స్వచ్ఛందంగా తప్పుకుందా? లేదా అలా వెళ్లిపోయినందుకు నిర్మాతలే తప్పించారా? అన్నది కచ్ఛితంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా మహేష్ లాంటి టాప్ హీరోతో నటించేందుకు హీరోయిన్లంతా క్యూ కడుతుంటే... కాల్షీట్ పేరిట వచ్చిన అవకాశాన్ని శృతిహాసన్ చేజార్చకుందని సీని పరిశ్రమ చెబుతుంది. మరి తరువాతి హీరోయిన్ సమంతేనా అన్నది తెలియాలంటే డిసెంబర్ మొదటి వారం వరకు వేచి చూడాల్సిందే.