ప్లేబ్యాక్ సింగర్ గా, యాంకర్ గా ఇంకా డబ్బింగ్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడూ పాటల ప్రోగ్రాముల్లో జడ్జిగా అందరికీ సుపరిచితురాలైన సునీత ఇప్పుడు యాక్టర్ గా మారిపోతోందట. ఆవిడ నటిగా బ్రహ్మాండంగా పనికి వస్తుందనేది అప్పుడప్పుడూ ఆవిడ ఇంటర్వ్యూల్లో, మాటల్లో హావభావాలు పలికించడాన్ని బట్టి అర్థ మవుతోందనుకోండి... అయితే ఆమెకు అనేక సినిమా అవకాశాలు వచ్చినా... ఒప్పుకోలేదట. అయితే ఈ దర్శకుడు ఆమెకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఉపయోగించుకోవాలనుకున్నాడేమో... ఆవిడ చేతే యాక్టింగ్ చేయించేస్తున్నారు. ఆ దర్శకుడెవరో కాదు. శేఖర్ కమ్ముల. ఆ మధ్య తన సినిమా 'అనామిక' కోసం ఆమెను ఒప్పించారు. 'అనామిక' చిత్రం ప్రమోషనల్ సాంగులో ఆమెతో నటింపజేసారు. తాజాగా ఆమెను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన సినిమాలో నటింపచేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తను దర్శకత్వం వహిస్తున్న ‘బ్రహ్మోత్సవం' చిత్రంలో సునీతతో ఓ ముఖ్యమైన పాత్ర చేయిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సునీత కూడా ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.