బాగా నచ్చిన పరశురాం కథ

February 02, 2015 | 04:53 PM | 26 Views
ప్రింట్ కామెంట్

యువ నటుడు అల్లు శిరీష్.. చక్కని స్క్రిప్టు కోసం ఏడాది పాటు వెయిట్ చేసిన సంగతి తెలిసిందే. ‘గౌరవం’, ‘కొత్త జంట’ తరువాత ఆయనకు మంచి కథలేమీ రాలేదు. చేసిన సినిమాలు కూడా కమర్షియల్ గా సక్సెస్ అయినప్పటికీ అనుకున్నంతగా శిరీష్ కు తృప్తి నివ్వలేకపోయాయి. మంచి కథల కోసం చాలా వెయిట్ చేశాడు. అయితే చివరకు డైరెక్టర్ పరశురాం కథ ఆయనకు బాగా నచ్చిందంటున్నాడు. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కథ కోసం ఎదురు చూసిన శిరీష్ కు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చిందట. ‘సోలో’, ‘ఆంజనేయులు’, ‘యువత’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడు పరశురాం పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు శిరీష్ కోసం అతనికి నచ్చే విధంగా స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలిసింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరం చేస్తున్నారట. గీతా ఆర్ట్స్ నిర్మించే ఈ కొత్త చిత్రం షూటింగ్ ఈ నెల చివరి వారంనుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ