నోవాటెల్ లో ‘సైజ్ జీరో’ పాటల వేడుక

November 02, 2015 | 01:15 PM | 4 Views
ప్రింట్ కామెంట్
size-zero-audio-launch-niharonline

విభిన్న క్యారెక్టర్లతో దూసుకుపోతున్న అనుష్కకు సైజ్ జీరో కూడా ఓ ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. ఈ సినిమా కోసం 25 కేజీలు బరువు పెరగడం ఏ హీరోయిన్ చేయని సాహసం. ఒక్క కేజీ బరువు పెరిగినా... గ్లామర్ ఫీల్డ్ లో తమకు ఎక్కడ అవకాశాలు తగ్గుతాయో అని భయపడుతుంటారు హీరోయిన్లు కానీ అనుష్క మాత్రం సినిమా కోసం ఇంతలా బరువు పెరగడం అంటే... మళ్ళీ తన బాడీని సన్నబరుచుకుంటాననే కాన్ఫిడెన్స్ ఉండబట్టే కదా.... ఇలాంటి సాహసాలు. కత్తులు పట్టుకొని యుద్ధం సీన్లలో నటించడం ఓ సాహసమైతే... ఓ హీరోయిన్ ఇలా బరువు పెంచుకోవడం కూడా పెద్ద సాహకసమే. 
ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ‘సైజ్‌ జీరో’ లో అనుష్క, ఆర్య జంటగా నటించారు.  ఈ చిత్రాన్ని దర్శకుడు కామెడీతో మెసేజ్ కలగలిపి తెరకెక్కించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో నిర్వహించారు.
ఈ సినిమా ఎంత వెరైటీగో ఉందో ఈ ఆడియో ను కూడా అంతే డిఫరెంట్ గా తీశారు. వేడుకకు వచ్చిన అతిథులు వెయిట్ మిషన్ పై నిలబడి వెయిట్ చూసుకుని, ఎక్సర్ సైజ్ సైకిల్ ను తొక్కి పాటలను విడుదల చేశారు. 
ఈ వేడుకనుద్దేశించి కీరవాణి మాట్లాడుతూ ఇలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సిద్ధం చేసిన కణికను ముందుగా అభినందిస్తున్నాను.  రాఘవేంద్రరావుగారితో పనిచేశాను. ఆయన అబ్బాయితో పనిచేస్తానని అప్పుడు ఉహిచంలేదు. తను మంచి క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. నిర్మాత పివిపిగారు, అనుష్కలే  ఈ సినిమా రూపొందడానికి కారణం. ఇలాంటి కథను నమ్మి చేసిన పివిపిగారిని, సినిమాలో బాగా  కష్టపడి యాక్ట్ చేసిన అనుష్కను అభినందిస్తున్నాను. సాంగ్స్ బాగా వచ్చాయి. యూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌.. అన్నారు.
రాజమౌళి మాట్లాడుతూ బాహుబలి సినిమా షూటింగ్ టైంలో ఓ రోజు అనుష్క ఈ సబ్జెక్ట్ ను నెరేట్‌ చేసింది. తను ఎగ్జయిటింగ్‌తో చెప్పిన పాయింట్‌ అప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ తను మంచి సినిమా చేస్తున్నానని ఎగ్జయిట్ అవుతుందని అర్థమైంది. ట్రైలర్స్ ను ఎప్పుడో చూసేశాను. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ట్రైలర్ తోసినిమా చూడాలనే ఎగ్జయిట్‌మెంట్‌ కలిగించారు. అన్నారు. 
కార్యక్రమానికి అతిథులుగా కె.రాఘవేంద్రరావు, రాజమౌళి, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి, దిల్‌రాజు, రానా, గుణ్ణం గంగరాజు, బి.గోపాల్‌, వంశీపైడిపల్లి, గోపీచంద్‌ మలినేని, దశరథ్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ లతో పాటు యూనిట్ సభ్యులు అనుష్క, ఆర్య, అలీ, సోనాల్ చౌహాన్, నిరవ్ షా, కణిక, ప్రకాష్ కోవెలమూడి, పరమ్ వి.పొట్లూరి తదితరులు హాజరయ్యారు.
ఎస్‌.ఎస్‌.రాజమౌళి థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. బిగ్‌ సీడీని, ఆడియో సీడీలను కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ