స్నేహకు కొడుకు పుట్టాడు...

August 11, 2015 | 02:04 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sneha_baby_boy_niharonline

ఫామిలీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుతార స్నేహ.  గ్లామర్ పాత్రలజోలికి వెళ్ళకుండా సాధారణ గృహిణిగా నటించి అందరి మన్ననలూ పొందింది. పెళ్ళి తరువాత కూడా ఇటీవల సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఓ ప్రత్యేక పాత్రలో చేసి, అందరి మెప్పులూ పొందింది.2012లో తమిళ యాక్టర్ అయిన ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ మధ్యే తన శ్రీమంతం ఫొటోలను నెట్ లో పోస్ట్ చేసి తల్లి కాబోతోందన్న విషయాన్ని అభిమానులకు చెప్పుకుంది. అయితే స్నేహ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు... ఈ రోజు ఉదయం మీడియాకు తెలిపారు. దీంతో స్నేహ, ప్రసన్నలతో పాటు వారి కుటుంబ సభ్యులు చాలా హాపీగా ఈ చిన్ని హీరోని ఆహ్వానించారు. ప్రస్తుతం స్నేహ కుటుంబమంతా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ