తెరవెనుక సోనమ్ కథ

February 18, 2015 | 01:11 PM | 17 Views
ప్రింట్ కామెంట్
sonam_rhea_niharonline

అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ బాగా పాపులర్ అయిన మోడల్, యాక్ట్రెస్ కూడా. అయితే బాలీవుడ్ లో ఈమెకు హీరోయిన్ గా కంటే ఫ్యాషన్ ఐకాన్ గానే బాగా పేరుంది. ఇండస్ట్రీలో ఏ పార్టీ జరిగినా, సినిమా వాళ్ళ కళ్ళు ముందుగా సోనమ్ వేసుకున్న డ్రెస్ పైనే ఉంటుందట. ఈమె సోదరి రియా కపూర్ కూడా ఫ్యాషన్ డిజైనర్. ఈమె ఈ రంగంలోనే సెటిల్ అయిపోవాలనుకున్నట్టుంది. తన ఆసక్తి అంతా దీనిపైనే... సినీ నటుల పిల్లలు నటులే కానక్కర లేదు కదా, చేయాలనుకుంటే ఫీల్డుతో కొద్దో గొప్ప సంబంధం ఉన్న ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటే దుస్తుల బిజినెస్సే కదా. ఇప్పటికే సినీ నటులు చాలా మంది సైడ్ బిజినెస్ గా దీన్నే ఎంచుకున్నారు. ఇప్పుడు రియాతో కలిసి సోనమ్ కపూర్ ఈ బిజినెస్ నే ప్రారంభించబోతోంది. ఈ ఇద్దరక్కచెల్లెళ్ళకు ఫ్యాషన్ పై మక్కువ, వాటిపై చక్కని అభిరుచి కూడా ఉంది. అందుకే వీళ్ళ ప్రత్యేక బ్రాండ్ తో దుస్తుల్ని విడుదల చేయబోతున్నారట. వచ్చే నెల నుండి ప్రముఖ బట్టల దుకాణాల్లో వీళ్ళ బ్రాండ్ ‘రిసోన్’తో బట్టలు అమ్మకానికి పెడుతున్నారు. రియాలోని ‘రి’, సోనమ్ లోని ‘సో’ను తీసుకుని ‘రీసోన్‘ అని తమ బ్రాండ్ పేరును ఫిక్స్ చేశారట. వీరి బ్రాండ్ లో టీ షర్టులు, ఫ్రాక్స్, స్కర్టులు, టాప్స్ గట్రా వివిధ సైజుల్లో తయారు చేసి షాపర్స్ స్టాప్ మాల్స్ కు పంపిస్తారట. ఇంకేముంది అనీల్ కపూర్ కూతుర్లు ఇద్దరు బిజినెస్ లో అడుగెట్టేశారు. సోనమ్ నటనలోనూ, మోడలింగ్ లోనూ ప్రూవ్ చేసుకుంటోంది. కొడుకు హర్షవవర్ధన్ కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా అనురాగ్ కష్యప్ వద్ద ‘బాంబేవెల్వెట్’కు పని చేసి, నటుడుగా కూడా ‘మిర్జా సాయిబా’ అనేచిత్రంలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ