తమిళనాట రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత 90వ దశకంలో స్టార్ హీరోగా వెలుగొందిన వ్యక్తి విజయ్ కాంత్. నటుడిగానే కాదు రాజకీయవేత్తగా కూడా తమిళనాడులో ప్రస్తుతం రాణిస్తున్న వ్యక్తి. పురట్చి కళింగర్ అంటే తమిళ ఇండస్ట్రీలో తిరుగుబాటు తీసుకోచ్చిన వ్యక్తి అని ప్రేక్షకుల చేత ముద్దుగా పిలుచుకునే వ్యక్తి ఈయన. ఈరోజు (ఆగస్ట్ 25న) ఆయన పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన గురించి నీహార్ ఆన్ లైన్...
విజయ్ కాంత్ అసలు పేరు విజయ్ రాజ్ అళగర స్వామి నాయుడు. ఈయన ఆగస్టు 25, 1952 లో తమిళనాడులోని మధురై పట్టణంలో జన్మించాడు. 1979 లో ఇనిక్కుమ్ ఇలమయ్ ఆయన మొదటి చిత్రం. ఇదయదళపతి విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో విజయ్ కాంత్ ఎక్కువ చిత్రాల్లో నటించారు. 1991 లో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ ఓ సెన్సెషన్. ఇక అప్పటి నుంచి ఆయనను కెప్టెన్ గా అక్కడి జనాలు పిలుస్తారు. మాస్ ప్రేక్షకుల్లో ఆయనకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన నటించిన చాలా చిత్రాలు తెలుగు, హిందీలోకి డబ్ అయ్యాయి. తమిళంతోపాటు తెలుగులో కూడా విజయ్ కాంత్ చిత్రాలు విజయాలు సాధించాయి. ముఖ్యంగా కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్, పోలీస్ కమిషనర్ వంటి చిత్రాలు ఇక్కడా బాగానే ఆడాయి. చిరంజీవి ఠాగూర్ ఒరిజనల్ వర్షన్ రమణ ఈయనదే. ఇక సింహాద్రి సినిమాని తమిళంలో ఈయన హీరోగా గజేంద్ర పేరుతో తెరకెక్కించి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. 2005లో రాజకీయ పార్టీని స్థాపించినారు. దాని పేరు దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అనగా తెలుగు అర్ధం: ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య. ప్రస్తుతం ఆయన అక్కడ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కెప్టెన్ టీవీ పేరిట 2010 లో ఓ చానెల్ కూడా నెలకొల్పారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు.
ఆయన ఇలాంటి పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ... నీహార్ ఆన్ లైన్ తరపున కెప్టెన్ విజయ్ కాంత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.