శ్రీదేవి ఇద్దరు కూతుర్లతో కలిసి బోనీ కపూర్ జేబులు కాళీ చేస్తారని ఓ టాక్. నిజానికి ఆయన జేబులు తడమాల్సిన అవసరం శ్రీదేవికి లేదనుకోండి... అయినా శ్రీదేవి ఇప్పటికీ నవ యవ్వన వతిలా మోడరెన్ డ్రెస్సుల్లో కూతుర్లతో పాటు తెగ పోజులిచ్చేస్తుంది. మరి తల్లి ఇంత మోడరన్ గా షో చేస్తే కూతుర్లు ఊరుకుంటారా చెప్పండి... వాళ్ళూ బుజ్జి బుజ్జి డ్రెస్సుల్లో అందాలు తెగ ఒలకబోస్తున్నారు. అదంతా ఒక ఎత్తయితే... పిల్లలకు స్వేచ్ఛ తల్లిదండ్రులిచ్చారో... లేక వారే తీసేసుకున్నారో గానీ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి బాగా ముదిరి పోయిందట. తను బాగా ఇష్టపడే వాడిని ముద్దు పెట్టుకొని ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . పెద్ద కూతురు జాహ్నవి పబ్బులు, క్లబ్బులు అని ఫ్రెండ్స్ తో తెగ చెక్కర్లు కొడుతోంది. ఇక చిన్న కూతురు నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ తెగ చూపించేస్తూ చిన్న దుస్తులు వేసుకుంటోంది. ఆ మధ్య సైఫ్ కొడుకుతో దిగిన ఫొటోలు సోషల్ నెట్వర్క్ లో హల్ చల్ చేశాయి. ఇక అది చాలదన్నట్టు ర్యాప్ మోడల్ అయిన ఎడ్ షీరన్ జాక్ గ్లిన్ స్కీ ని గట్టిగా ముద్దు పెట్టి ఆ ఫోటో తీయించి సోషల్ మీడియాకు ఎక్కింది . ఇంకేముంది బోనీ కపూర్ కూతుళ్ళనిద్దరినీ కాపాడుకోలేక నానా తిప్పలు పడాలేమో పాపం.