మనసారా, బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమాల ద్వారా తెలుగు స్క్రీన్ మీద కనిపించిన నటి శ్రీదివ్య. చక్కటి పెర్ఫార్మెన్స్ ఉన్న నటి అయినప్పటికీ తెలుగులో సక్సెస్ కాకపోవడంతో తమిళంలోకి అడుగు పెట్టింది. ‘వరుత్త పడాద వాలిబర్ సంగం’ అనే సినిమాతో తమిళ నాట మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుని నూతన నటిగా సైమా అవార్డు కూడా గెలుచుకుంది. కోలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. అయితే ఇప్పుడు కోలీవుడ్ హీరోయిన్లు ఈమె వల్ల ఆఫర్లు తగ్గుతున్నాయని ఒకింత జలసీ చూపిస్తున్నారట. ఈమెపై దుష్ర్పచారం కూడా మొదలుపెట్టారట. ఈమె ఇప్పుడు పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ లు దక్కించుకోవడంతో ఈమె వయసు చాలా ఎక్కువనీ, యువ హీరోలందరూ ఈమె సరసన నటిస్తున్నారని ప్రచారం చేస్తున్నారట. ఓ చిత్రంలో ఈమె కాలేజీ విద్యార్థినిగా కూడా నటిస్తోందట. వరుసగా మూడు హిట్లు రావడం మరో రెండు విడుదలకు సిద్ధంగా ఉండడమే కాక త్వరలో కార్తీతోఓ సినిమాకు ఆఫర్ కూడా వచ్చిందట. దీంతో ఇప్పుడు ఈమె వయసు 28 ఏళ్లు అంటూ ప్రచారం మొదలు పెట్టారట అక్కడి హీరోయిన్లు. శ్రీదివ్య మాత్రం అస్సలు ఇలాంటివి పట్టించుకోవడంలేదు. ఇండస్ర్టీలో ఇలాంటివి సహజమని, ప్రతీ విషయానికి స్పందిస్తే ఇమేజ్ దెబ్బతింటుందని కూల్ గా సమాధానం చెపుతుందట అడిగిన వారికి. ఇంతకూ ఈ అమ్మడిది హైదరాబాదే. ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా హనుమాన్ జంక్షన్, యువరాజు, వీడే చిత్రాల్లో నటించింది కూడా. నటీనటులకు ఉండాల్సింది పెర్ఫార్మెన్స్ గానీ, వయసుతో పనేంటి? హీరోకి యాభై ఉన్నా ఏం లేదు గానీ... హీరోయిన్ కు అందులో సగం కూడా ఉండకూడదా?