ఎప్పటి నుంచో ‘బెంగుళూరు డేస్’ (మళయాళ) రీమేక్ సినిమా కోసం నటీ నటుల ఎంపిక డైలమాగా కొనసాగుతోంది. ఈ సినిమాలో మొదట సిద్ధార్థ, సమంతలను అనుకున్నారు. కానీ సమంత చేయనని చెప్పడంతో చివరికి ఈ సినిమాలో శ్రీదివ్యను ఆ ఛాన్స్ దక్కిందట. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ప్రధాన కథానాయికగా శ్రీదివ్య నటిస్తోంది. ఈ అమ్మడు ఇంతకు ముందు బస్టాప్, మల్లెల తీరంలో సిరిమల్లె పువ్వు సినిమాల్లో నటించింది. కానీ తరువాత తెలుగులో అవకాశాలు రాకనో లేదా తమిళంలో అవకాశాలు ఎక్కువవడం వల్లనో తెలుగు తెరకు కాస్త దూరమైంది. తమిళంలో మాత్రం ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది. తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోయినా, తమిళ ప్రేక్షకులకు బాగా తెలిసినమ్మాయి కాబట్టి ఈ సినిమా తమిళ రీమేక్ కూడా చేస్తుండడంతో శ్రీదివ్య నటించడం సినిమాకు ప్లస్ అవుతుందని భావించారు. అయితే ఇందులో హీరోలుగా నాగచైతన్య, ఆర్య నటించనున్నారనే వార్తలు ఇప్పటి వరకూ వినిపించాయి. కానీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.