టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత రెండు చిత్రాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఫెర్ఫార్మెన్స్ పరంగా వన్, ఆగడు లో కొదవ లేనప్పటికీ కమర్షియల్ గా ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. అయితే ఏడాది టైం తీసుకున్న మహేష్ పక్కా ప్రణాళికతోనే శ్రీమంతుడితో ముందుకు రాబోతున్నాడు. ఇటీవల ఆడియో పంక్షన్లో కూడా మహేష్ అదే చెప్పాడు. అభిమానులకు ఏం కావాలో అదే ఇచ్చేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నిస్తానని, ప్రయోగాత్మక చిత్రాలకు జోలికి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చాడు. మరి శ్రీమంతుడిలో అంతలా అకట్టుకునే కథ ఏంటనేది ఇప్పుడు ప్రేక్షకుల మెదళ్లో నానుతున్న ప్రశ్న. ఇక శ్రీమంతుడు కథ విషయానికొస్తే... హర్ష (మహేష్ బాబు) ఓ ధనికుడి(జగపతి బాబు) కొడుకు. అన్ని ఉన్నా ఏదో వెలితి హర్షను వేధిస్తుంటుంది. ఈ క్రమంలో అల్రెడీ తన తండ్రి స్నేహితుడి కుమార్తెతో (అంగనా రాయ్ ) జరిగిన ఎంగేజ్ మెంట్ ను కాన్సిల్ చేసుకుంటాడు. ఇక అతను తనకు కావాల్సింది వెతుక్కూంటూ ఇండియాకు వస్తాడు. ఇక్కడ ఓ కాలేజీ లో చేరిన అతను హీరోయిన్ క్యారెక్టర్ కు ఆకర్షితుడై ఆమె పై మనసు పారేసుకుంటాడు. ఇంతలో హఠాత్తుగా ఆమె తన సొంత గ్రామానికి వెళ్లాల్సి రావటం. అక్కడ ఆమెకు సమస్యలు ఎదురుకావటంతో హీరో ఆ ఊరికి ఎంట్రీ ఇస్తాడు. అంతేకాదు ఆ ఊరిని దత్తత తీసుకుని బాగు చేద్దామనుకుంటాడు. ఈ క్రమంలో హీరోయిన్ తండ్రి (రాజేంద్ర ప్రసాద్ ) ఇంట్లోనే ఉంటూ అభివృద్ధికి అడ్డుపడుతున్న చెడుతో పోరాడుతుంటాడు. ఇక తన కొడుకు సమస్యల్లో ఉన్నాడని తెలిసిన తండ్రి ఇండియాకు వస్తాడు. వెంటనే హీరో తన తండ్రికి ఆ ఊరికి ఉన్న సంబంధాన్ని తెలుసుకుంటాడు. ఇక చివర్లో చెడును మంచిగా మార్చటంతో కథ సుఖాంతమవుతుంది. ప్రస్తుతం ఈ కథ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది. ట్రైలర్ దీనికి దగ్గరగా ఉన్నప్పటికీ నిజకథేంటో తెలియాలంటే ఆగష్టు 7 వరకు ఆగాల్సిందే.