అలనాటి నటి గౌతమి తన కూతురు సుబ్బులక్ష్మిని తెరంగేట్రం చేయించడానికి చాలా ఉత్సాహ పడుతోంది. ఈ విషయం ఇప్పటికే అన్ని పత్రికలూ ఛానళ్ళూ, వెబ్ పోర్టల్స్ చెప్పేసాయి కూడా. అయితే సినిమాలోకి రావాలంటే ముందుగా ఏమేం నేర్చుకోవాలో తల్లి గౌతమికి తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ గా టాప్ లెవల్ లో ఉన్న శృతిహాసన్ తనకు సలహాలిస్తోంది. నిజమే మరి, ఆ కాలం హీరోయిన్ కి ఈ కాలం హీరోయిన్ కి తేడా ఉంటుంది కదా మరీ, అయితే ముందు మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంటే, హీరోయిన్గా తేలిగ్గా రాణించగలమనే అభిప్రాయాన్ని శృతిహాసన్ వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు సుబ్బులక్ష్మి పేరు ముందు మార్చాలని చెప్పినట్టు కూడా తెలిసింది. ఇప్పటికే తమిళ దర్శక, నిర్మాతలు సుబ్బులక్ష్మిని హీరోయిన్గా పరిచయం చేస్తామంటూ ముందుకొస్తున్నారట. ముందు బాలీవుడ్ లో పరిచయం చేస్తే దక్షిణాదిలో అవకాశాలు అవే వస్తాయని ఆమె సన్నిహితులు సలహా ఇస్తున్నారట. సినీ ఫీల్డులోని సాదకబాదకాలు హీరోయిన్ గా చేసిన తల్లికే బాగా తెలుసు. ఇప్పటికే అమ్మడికి డాన్స్ కూడా నేర్పిస్తోందట. ఇక ఛాన్స్ రావడమే తరువాయి.