తమ సినిమాలో నటించడానికి ఒప్పకుని చివరి నిమిషంలో తప్పుకున్నందుకు పివిపి సినిమా సంస్థ శృతిహాసన్ పై కోర్టు ఆర్డర్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో శృతి తనేమీ మాట్లాడకుండా ఓ నిర్మాతపై మరో నిర్మాతను ఉసిగొల్పింది. ఇక ఈ విషయంలో తానేమీ మాట్లాడే అవకాశం లేకుండా, ఇటు కోర్టువారితోగానీ, పివిపి నిర్మాతతో గానీ ఏమీ మాట్లాడే అవకాశం లేకుండా చాలా తెలివి ప్రదర్శించింది శృతి. మాట్లాడితే లీగల్‌గా ఏం తలనొప్పులు వస్తాయో తెలీదు కాబట్టి తెలివిగా మరో నిర్మాతతో పివిపిపై ఎటాక్ చేయించింది. తమిళంలో ఆమెతో పులి చిత్రం తీస్తున్న నిర్మాత శృతి తరఫున వకాల్తా తీసుకుని పివిపిపై నిప్పులు చెరిగాడు. ఆమె కొత్త సినిమా ఒప్పుకుందని పివిపి చేస్తోన్న ప్రచారం బూటకమని, ఎప్పుడో అంగీకరించిన పులి చిత్రం కోసం ఆమె పెద్ద మనసు చేసుకుని అప్పటికప్పుడు డేట్స్ సర్దుబాటు చేసిందని, దీనిని కావాలని ఇష్యూ చేసి ఆమెని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సదరు నిర్మాత చెలరేగిపోతున్నాడట ఇప్పుడు. ఇలా మలుపు తిప్పడానికి కారణం ఎవరనేది తెలియకపోయినా, శృతి చాలా తెలివిగలదంటూ కామెంట్లు వినిపిస్తున్నా టాలీవుడ్ కోలీవుడ్లో.