అంతకు ముందు వరకూ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓవర్సీస్ బాక్సాఫీస్ లో కలెక్షన్లు రాబట్టేవి. ఇప్పుడు భలే భలే మగాడివోయ్ లాంటి సినిమాలను కూడా అక్కడ హిట్ చేస్తుండడంతో... ఇప్పుడు దర్శకులే ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని విడుదల చేసుకునే ట్రెండ్ ఫాలో అయిపోతున్నారు. మారుతి
భలే భలే మగాడివోయ్ చిత్రం ఓవర్సీస్ లో ఒక వారంలో కోటి కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమా ఇక్కడే కాకుండా విదేశాల్లో సైతం సూపర్ సక్సెస్ సాధించడంతో మారుతికి డైరెక్టర్ గా రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ ఓవర్ సీస్ ద్వారా వచ్చేసింది. ఇక ఇప్పుడు డైరెక్టర్ హారీష్ శంకర్ కూడా సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని ఓవర్ సీస్ లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించడంతో చిత్రంపై అంచనాలు బాగా పెరిగిపోయాయి. చిత్రబృందం కూడా ఈ సినిమా గురించి చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ హారీష్ శంకర్ సుబ్రమణ్యం పర్ సేల్ తనకి ఖచ్చితంగా సక్సెస్ ఇస్తుందనే కాన్పిడెన్స్ తో ఉన్నారు. ఈ చిత్రం ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది తెలియాలంటే ఈ నెల 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.