ఇంతకు మించిన ‘భలేమంచి రోజు’ లేదన్నట్టేనా?

August 10, 2015 | 11:59 AM | 2 Views
ప్రింట్ కామెంట్
bhalemanchi_roju_first_look_niharonline

మహేష్ చిన్నబావ సుధీర్ బాబుకు వరుసతో సంబంధం లేని అభిమానంలా అనిపిస్తుంది సూపర్ స్టార్ ఫామిలీ అంటే... మహేష్ అభిమాను తమ అభిమాన సంఘాలతో, యాక్టివిటీస్ తో అభిమానం ప్రదర్శిస్తే... ఈయనా ఓ సినిమా స్టార్ అయినప్పటికీ ఎప్పుడు మామగారి, బావమరిది గారి పాట పాడేస్తుంటాడు. బహుశా ఈ అభిమానం వరుస కలుపుకోకముందునుంచే ఉన్నట్టు కనిపిస్తుంది.  సుధీర్ బాబు బంధుత్వంతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబుని ఓ అభిమాన కథానాయకుడిలాగే చూస్తుంటాడు. తన సినిమాలకు ప్రమోట్ చేయడానికి గానీ, ఓ పాత్రలు నటించడానికి గానీ ఇష్టపడడు... ఆయన స్థాయికి తగినది అనిపిస్తేనే అడగాలి... తన సినిమాకు లాభమని ఆయన స్థాయిని దించకూడదంటుంటాడు. మహేష్ బాబు ఇమేజ్ ఎప్పుడూ ఆ స్థాయిలో ఉండాలని కోరుకునే అభిమానుల్లో ఈ అభిమాని (బావ సుధీర్ బాబు) కూడా ఒకడన్నమాట.  తన కోసం కిందకి దిగకూడదనేది సుధీర్  అభిప్రాయం. అందుకే మహేష్ కి కూడా సుధీర్ అంటే చాలా అభిమానం. తన టాలెంట్ ని చూసి మురిసిపోతుంటాడు మహేష్. మామూలుగా మహేష్ పుట్టినరోజు పండగ వచ్చేసిందంటే అభిమానులతో ఫిల్మ్ నగర్ కళకళలాడిపోతుంటుంది. మహేష్ కి విషెస్ చెప్పాలని తహతహలాడుతుంటారు. ఆయన ఊళ్లో లేకపోయినా సరే అభిమానులు మాత్రం మహేష్ ఇంటికి వెళ్లి కాసేపు సందడి చేసొస్తుంటారు. మరి సుధీర్ బాబు  మహేష్ పుట్టినరోజున ఆయన ‘భలే మంచి రోజు’ కాబట్టి తన సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సుధీర్ కథానాయకుడిగా `భలే మంచి రోజు` అనే చిత్రం తెరకెక్కుతోంది. ఓ థ్రిల్లర్ కథ తో ఈ సినిమా రూపొందుతోంది. 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ