సుకుమార్ మాట తప్పుతున్నాడా?

February 01, 2016 | 12:25 PM | 2 Views
ప్రింట్ కామెంట్
sukumar_devisri_movie_in_dilemma_niharonline

వైవిధ్యమైన కథాంశాలతో హాలీవుడ్ స్థాయిలో సినిమాలను తెరకెక్కిస్తూ హీరోలను డిఫరెంట్ పంథాలో చూపించటం ఒక్క సుకుమార్ కే చెందుతుంది. తాజాగా నాన్నకు ప్రేమతోలో జూనియర్ లోని సరికొత్త కోణాన్ని చూపించి మాస్ ఇమేజ్ అనే ముద్రను చెరిపిపడేశాడు. ఇక ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుక్కూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి రివీల్ చేశాడు. తన నెక్స్ట్ మూవీ ఓ మెగా హీరోతో ఉంటుందని చెప్పాడు.

నిజానికి తన తదుపరి చిత్రం తర్వాత రిటైర్డ్ అవుతానని సుక్కూ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తన బ్యానర్ లో కథలను మాత్రమే అందిస్తూ కొత్త దర్శకులను ప్రొత్సహిస్తానని తెలిపాడు. అయితే అదే సమయంలో దేవిశ్రీప్రసాద్ హీరోగా పరిచయం చేస్తానని కూడా చెప్పుకోచ్చాడు. దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కున్న ఈ చిత్రంపై దేవీ కూడా స్పందించాడు. మరో రెండు నెలలో  సినిమా మొదలవుతుందని ప్రకటించాడు. ఇందుకోసం సమంతను హీరోయిన్ గా కూడా ఎంపిక చేసినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడేం అయ్యిందో కానీ, సడన్ గా బన్నీ లేదా చరణ్ అంటూ ప్రకటించాడు సుక్కూ. అంటే దేవీ తో సినిమా ఉన్నట్లా లేనట్లా లేక కేవలం కథను మాత్రమే అందించి కొత్త దర్శకుడితో కానిస్తాడా? మొత్తానికే హ్యాండ్ ఇస్తాడా?  సినిమాల్లో లాజిక్ లతోనే కాదు, ఇలా స్టేట్ మెంట్లతో కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ