హేబాను సుకుమారంగా హ్యాండిల్ చేస్తున్నాడు

January 12, 2016 | 04:00 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sukumar-hebah-patel-rakul-niharonline

సుకుమార్ రైటర్ కమ్ నిర్మాతగా మారి నిర్మించిన ‘కుమారి 21 F’ సినిమాతో ఒక్కసారిగా హైలెట్ అయ్యింది హేబా పటేల్. బోల్డ్ యాక్టింగ్ చేసినప్పటికీ ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఇక తన స్కూల్ నుంచే పేరు రావటంతో తన చిత్రంలోనూ ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు సుక్కూ. నాన్నకు ప్రేమతో లోనూ హేబా పటేల్ కి చోటు కల్పించాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి సిస్టర్ పాత్రలో ‘హేబా పటేల్’ నటిస్తుంది. ఈ పాత్ర నిడివి తక్కువుగా ఉన్నప్పటికీ, హేబా పటేల్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడే గొడవొచ్చిపడింది.

              హేభపటేల్ కారణంగా రకుల్ ప్రీత్ సింగ్ సీన్స్ నిడివి తగ్గిందట. అంతే కాకుండా షూటింగ్ సమయంలో హేభపటేల్ ని సుకుమార్ సున్నితంగా డీల్ చేశాడని సమాచారం. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కి అసలు అంత ప్రాముఖ్యత ఇవ్వటం లేదన్న విషయం ఇప్పుడు బయటికి వస్తోంది. అంతేకాదు ఓ షాట్ సందర్భంగా రకుల్ కి, హేబా కి మధ్య గొడవ కూడా జరిగినట్లు తెలుస్తోంది. పరిష్కారం కొరకు సుకుమార్ వద్దకు వెళితే, సుకుమార్ హేభపటేల్ కి సపోర్ట్ చేయటం సెట్లో అందరికి ఆశ్ఛర్యాన్ని కలిగించిందట. మొత్తంగా సుకుమార్ అండతో హేభపటేల్ అప్పుడే హీరోయిన్స్ తో గొడవలేసుకుంటుందని అంటున్నారు. ఇక రకుల్ సైతం ఈ మ్యాటర్ పై కోపంగా ఉన్నప్పటికీ, ఇలాంటి గొడవల దూరంగా ఉండాలని లైట్ తీస్కుందట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ