తెలుగు సినిమాకు నూతనాధ్యాయం మొదలైంది

October 09, 2015 | 05:41 PM | 1 Views
ప్రింట్ కామెంట్
suman-about-rudramadevi-niharonline

ఈ రోజు విడుదలైన రుద్రమదేవి సినిమాకు పలువురు సినీ సెలెబ్రిటీస్ నుంచి మంచి స్పందన లభిస్తోందంటూ ఈ సినిమాలో నటించిన సుమన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సీఎం ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వడం వల్ల ఇలాంటి చారిత్రక సినిమాలు మరికొన్ని రావడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టవుతుందని అన్నారు. చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే ఈ తరహా చిత్రాలను తీయడానికి మరికొందరు ముందడుగు వేస్తారని అన్నారు. గుణ శేఖర్ ఇన్నేళ్ళ కష్టానికి ఫలితం ఇప్పుడు కనిపిస్తోందని అన్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకుడు హరిహర దేవుడు పాత్రలో సుమన్ నటించారు. ఈ చిత్రం చూసిన పలువురు ఈ సినిమా బాగుందంటూ ఆయనను అభినందించడంపై చాలా ఆనందంగా ఉన్నారు. "చిత్రానికి ప్రతి ఒక్కరి నుంచి మంచి స్పందన లభిస్తుంది. గుణశేఖర్ గారి కృషి, పట్టుదల వలన ఈ విజయం సాధ్యమైంది. చరిత్రపై ఎంతో పరిశోధన చేసి, ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి చిత్రం తెరకెక్కించారు. తెలుగు చిత్రసీమలో ఈ చిత్రం కొత్త అధ్యాయం లిఖించింది. అనుష్క, అల్లు అర్జున్ అద్వితీయంగా నటించారు. నేను హరిహర దేవుడు పాత్రలో నటించాను. కాకతీయ సింహాసనాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే పాత్ర. బాగా నటించావ్ అంటూ పలువురు ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని వివరించారు.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ