సుమంత్ కి వెంకీ ఆల్ ది బెస్ట్

October 17, 2015 | 05:13 PM | 1 Views
ప్రింట్ కామెంట్
sumanth-ashwin-columbus-movie-audio-launch-niharonline_(64)

సుమంత్ అశ్విన్ హీరోగా ఆర్, సామల దర్శకత్వంలో వస్తున్న సినిమా కొలంబస్. ఈ చిత్రం ఆడియోను ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్ లో హీరో వెంకటేష్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఎ.కె.ఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై అశ్వనీ కుమార్ సహదేవ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుమంత్ అశ్విన్ కు జంటగా సీరత్ కపూర్ నటించగా, మిస్టీ చక్రబొర్తి మరో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ ఆడియో కార్యక్రమంలో 
వెంకటేష్ మాట్లాడుతూ... టీజర్ చాలా ఫ్రెష్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటివరకు విడుదలయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. అలానే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. దసరా కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అన్నారు.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాట్లాడుతూ అశ్విన్ తో అంతకముందు ఆ తరువాత సినిమా చేసాను. అశ్విన్ మూస చిత్రాల్లో కాకుండా కొత్త పాత్రలను ఎన్నుకుంటున్నాడు. ఈ సినిమాతో తను మంచి స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. సాయి కిరణ్ అడవి మాట్లాడుతూ ఎం.ఎస్.రాజు గారంటే నాకు సెంటిమెంట్. వినాయకుడు సినిమా ఓపెనింగ్ ఆయన చేతుల మీదుగా చేసాను. అలానే ఆయన కొడుకుతో కేరింత సినిమా చేసాను. నాకు రెండు సినిమాలు పెద్ద హిట్స్ గా నిలిచాయి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నాడు. బి.గోపాల్ మాట్లాడుతూ టైటిల్, పోస్టర్స్ బావున్నాయి. ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఎం.ఎస్.రాజు కుమారుడు అశ్విన్ మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమా విజయం సాధించి వారు మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నాను. అని చెప్పారు. నిర్మాత అశ్విని కుమార్ సహదేవ్ మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్ లో మొదటి చిత్రమిది. ప్రస్తుతం ఉన్న జనరేషన్ తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది. మంచి హిట్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం అన్నాడు. దర్శకుడు ఆర్.సామల మాట్లాడుతూ నన్ను నమ్మి నాతో సినిమా చేయడానికి సపోర్ట్ చేసిన నిర్మాతలకు ధన్యవాదాలు. కొలంబస్ తెలియకుండా ఓ మూలన పడిపోయిన అమెరికా ప్రాంతాన్ని కనుక్కొన్నాడు. అలానే ఎం.ఎస్.రాజు గారు నాలో ఉన్న దర్శకున్ని కనుక్కొని నాకు ఈ సినిమా చేసే చాన్స్ ఇచ్చారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. అని చెప్పారు. ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ అక్టోబర్ 22న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం. టెక్నీషియన్స్ అందరికి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ  టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడి సినిమా చేసారు. జితిన్ మంచి పాటలు కంపోజ్ చేసాడు ప్రొడ్యూసర్ చాలా బాగా సపోర్ట్ చేసారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: మనోహర్ అండ్ రాంబాబు, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: ఇంద్రసేన ఆర్, కోరియోగ్రఫీ: విజయ్, ఎడిటర్: కె.వి.కృష్ణారెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్ నాయర్, మ్యూజిక్: జితిన్ రోషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: జె.బి, సినిమాటోగ్రఫీ: భాస్కర్ సామల, ప్రొడ్యూసర్: అశ్వని కుమార్ సహదేవ్, డైలాగ్స్-డైరెక్షన్: ఆర్.సామల.

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ