కేర‌ళ లొ 's/o సత్యమూర్తి' సందడి...

April 22, 2015 | 03:10 PM | 44 Views
ప్రింట్ కామెంట్
kerala_sun_of_satyamurthy_niharonline

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కించిన చిత్రం 's/o స‌త్య‌మూర్తి' ఏప్రిల్ 9న అత్య‌ధిక ధియేట‌ర్స్ లొ విడుద‌లై రికార్డు క‌లెక్ష‌న్లు సాధించి సూప‌ర్‌డూప‌ర్ హిట్ గా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ 's/o స‌త్య‌మూర్తి' చిత్రాన్ని భారీ స్థాయిలో తెలుగు లో నిర్మించారు. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషించారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్ నటించారు. ఈ చిత్రం ఇటు తెలుగు, అటు క‌న్న‌డ‌లొ భారీ క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంది. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ కి తెలుగు లో వున్న అభిమానుల‌తో స‌రిస‌మానంగా మ‌ళ‌యాలం లో కూడా వున్నారు. గ‌తంలో అల్లు అర్జున్ న‌టించిన అన్ని చిత్రాల‌ను అక్క‌డ భారీ స్థాయిలో ఆద‌రించారు. ఇప్పుడు ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌ల‌య్యి తెలుగులో భారి విజ‌యాన్ని సాధించిన ఈ చిత్రం ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ ఈరోజు జ‌రిగింది. అశేష అభిమానుల స‌మ‌క్షంలో కేర‌ళ‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని రీతిలో కొచిన్ లోని లుల్లు మాల్ లో జ‌రిగింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ