సునీల్ చూపంతా ఆ స్టార్ డైరక్టర్ మీదే

March 05, 2016 | 03:49 PM | 3 Views
ప్రింట్ కామెంట్
sunil-request-trivikram-niharonline

హాస్య నటుడి నుంచి కథానాయకుడిగా సునీల్ ఒక్కోమెట్టు ఎక్కుతూ వచ్చాడు. అయితే ఈ మధ్య సునీల్ ను సక్సెస్ పలకరించకపోవడంతో, ఢీలా పడిపోయాడు. అస్సలు సెట్ కానీ సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ వరుసగా ఫ్లాపులు చవిచూస్తున్నాడు. కాస్త గ్యాప్ తీసుకుని చేసిన 'కృష్ణాష్టమి' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, సునీల్ మరింత నిరాశకి లోనైనట్లు సమాచారం. దీంతో స్నేహితుడి శరుణు వేడుకుంటున్నాడంట ఇప్పుడు.

                            మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సునీల్ మధ్య సానిహిత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇద్దరూ ఓకే రూమ్ లో ఉంటూ, సినిమాల్లో ప్రయత్నాలు చేశారు. గతంలో తన సినిమాల్లో సునీల్ కి మంచి పాత్రలను ఇచ్చి త్రివిక్రమ్ ప్రోత్సహించాడు. అలాగే తనతో ఒక సినిమా చేసి .. తనని మళ్లీ ఫామ్ లోకి తీసుకురావలసిందిగా ఆయనని సునీల్ కోరాడని తెలుస్తోంది. ప్రస్తుతం 'అ ఆ' లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ఆపై సూర్యతోగానీ, లేదా బన్నీ-నాగ్ కాంబోలో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉన్నట్లు భోగట్టా. మరి స్నేహం కోసం త్రివిక్రమ్ తన కమిట్ మెంట్లలో ఏమైనా మార్పులు చేస్తాడేమో చూద్దాం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ