ఒకప్పటి వైజాగ్ అందాలున్న సినిమా ఇది

December 06, 2014 | 03:39 PM | 21 Views
ప్రింట్ కామెంట్

‘ఉందిలే మంచీ కాలం ముందుముందూనా’ ఇది కూడా ఒక పాత పాట టైటిల్ సినిమా. ఇందులో వైజాగ్ అందాలన్నీ కనిపిస్తాయనీ, మా సినిమా తరువాతే హుధూధ్ సంభవించిందని అంటున్నాడు సుధాకర్ కొమాకుల. అరుణ్‌ దాస్యం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆయన కథానాయకుడిగా నటించారు. ఆమ్‌ ఆద్మీ పిక్చర్స్‌ పతాకంపై రవిరాష్‌ దాస్యం నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా పత్రికలవారితో మాట్లాడారు సుధాకర్‌. ఇందులో తనది రాక్‌ ప్లేయర్‌ కావాలనే ఆశయంతో ఉండే పాత్ర అనీ, కానీ జీవనాధారం కోసం ఆటో నడుపుతుంటాననీ, స్నేహానికీ, కుటుంబానికి విలువిచ్చే పాత్ర తనదని చెప్పు కున్నాడు సుధాకర్. ఇంకో హీరో కార్తీక్‌ హాకీ ప్లేయర్‌గా నటించాడన్నాడు. స్నేహితులం ఇద్దరం ఒకే ఆటోను నడుపుతుంటామని చెప్పాడు. ఇక అమ్మ పాత్రలో రాధిక నటించారనీ, ఆమె ఈవెంట్స్‌ చేస్తుంటే, ఆ ఈవెంట్స్‌ లో మా బ్యాండ్‌ బాజా ఉంటుందన్నారు. కార్తీక్‌ తండ్రిగా నరేశ్‌ నటించారు. సుధాకర్ ఇంతకుముందు శేఖర్‌ కమ్ముల ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో నటించాడు. అయితే తెలుగులో హాకీ నేపథ్యంలో తీసిన మొదటి తెలుగు సినిమా ఇదే నని అన్నాడు. ఇందులో నేషనల్‌ హాకీ ప్లేయర్లు కూడా నటించారు. ఈ చిత్రం పూర్తిగా వైజాగ్‌లో తీశామనీ, తాను అక్కడే పుట్టి పెరగడం వల్ల ఆ పాత్రకు బాగా కనెక్టయిపోయానన్నాడు. నేను పెరిగిన ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్‌ జరిపారనీ, ఇదివరకొచ్చిన వైజాగ్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుందనీ, వైజాగ్‌ లైఫ్‌స్టయిల్‌, పాత్రలు కూడా అక్కడి యాసలోనే మాట్లాడతాయని ముగించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ