సన్నీ లియోన్ పరిచయం అక్కర్లేని పేరు. పోర్న్ స్టార్ నుంచి పాపులర్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ తోపాటు పలు భారతీయ భాష అడపా దడపా పాత్రలు చేస్తూ పిచ్చపిచ్చగా క్రేజ్ ను తెచ్చేసుకుంది. ఆరంగ్రేటం నుంచే జనాల నోళ్లలో నానుతూ... ప్రేక్షకులు నోళ్లు వెళ్లబెట్టేలా ఆకట్టుకుంటూ యమ బిజీ అయిపోయింది. ముఖ్యంగా యూత్ లో ఈమెకున్న పేరు ఏపాటిదో అందరికీ ఎరుకే. దీనిని అసరాగా చేసుకునే నిర్మాతల దగ్గర నుంచి అందినంతా పిండేసుకుంటుంది. సినిమాల తోనే కాదు ఆ మధ్య ఓ పాపులర్ బ్రాండ్ కండోమ్ యాడ్ లో సెక్సీగా నటించి కవ్వించిన ఈ భామ ఇప్పుడు మరో యాడ్ కోసం భారీగా డిమాండ్ చేస్తోందట. ఓ ప్రముఖ మందుల కంపెనీ బ్రాండ్ షూట్ కోసం వారు ఊహించని రేంజ్ లో డిమాండ్ చేసిందట. నాలుగు రోజుల షూటింగ్ కోసం రూ.8 కోట్లు కావాలని అడిగిందట. అంటే రోజుకు రూ.2 కోట్ల రూపాయలు. ఇది విన్న కంపెనీవారు తొలుత షాక్ అయినప్పటికీ తర్వాత అడిగింది సన్నీ నే కదా అని సముదాయించుకున్నారట. అన్ని కుదిరితే త్వరలోనే షూటింగ్ కి రెడీ అయిపోయేందుకు అంగీకారం దాదాపు ఖరారయిపోయినట్లు సమాచారం.