బాలీవుడ్ లో మంచి చిత్రాల్లో నటించడం ద్వారా గతేడాది తాను చాలా నేర్చుకున్నానని శృంగార తార సన్నీలియోన్ తెలిపింది. కొత్త సంవత్సరంలో పాత అనుభవాలను కాస్త ఆలస్యంగా పంచుకుంది. 2015లో చాలా ఒడిదుడుకులకు లోనయ్యానని చెప్పింది. ఎన్నో ఆశలతో చేసిన 'ఏక్ పహేలీ లీలా', 'కుచ్ కుచ్ లోచాహై' సినిమాలు అపజయం పాలవడంతో ఆందోళన చెందినట్టు తెలిపింది.
ఓ సినిమా విజయం సాధిస్తే ఎంత సంతోషిస్తామో, విజయం సాధించకపోతే అంతే బాధపడతానని సన్నీ చెప్పింది. ఆ రెండు సినిమాల ద్వారా పొందిన ఓటమిని తాను మానసికంగా బలోపేతమయ్యేందుకు, ఎదిగేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నానని సన్నీ పేర్కొంది. ఏక్ పహేలీ లీలా సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పింది. ఈ సినిమా సక్సెస్ కాకపోయినా నటిగా తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిందని ఆమె పేర్కొంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నారని, ఇప్పట్లో బాలీవుడ్ ను విడిచి వెళ్లే ప్రసక్తి లేదని సన్నీ స్పష్టం చేసింది. త్వరలో ఆమె నటించిన అడల్డ్ కామెడీ మూవీ మస్తీ జాదే రిలీజ్ కు సిద్ధంగా ఉంది.