తాగుబోతుకు పిల్లనిచ్చి పెళ్ళిచేస్తున్నారోచ్....

May 21, 2015 | 01:14 PM | 52 Views
ప్రింట్ కామెంట్
tagubothu_ramesh_engagement_niharonline

తాగుబోతు నటనలో ఎందరినో చూశాం... అందరి నటననూ ఎంజాయ్ చేశాం... నవ్వుకున్నాం... కానీ ఎంత నేచురల్ గా అంటే నిజంగా తాగాడేమో అన్నంత ముద్ద ముద్దగా మాట్లాడుతూ మనని విపరీతంగా నవ్వించిన నటుడు తాగుబోతు రమేష్.... విచిత్రమేమిటంటే ఈ నటుడికి తాగుడు అలవాటే లేదట... చిన్నప్పటినుంచీ తన తండ్రి తాగినప్పుడు మాట్లాడే మాటలను బాగా అనుకరించి ఇంట్లో వాళ్ళను నవ్వించిన ఈ నటుడే ఇప్పుడు తెరమీద మనందరికీ నవ్వులు పంచుతున్నాడు.

ఇప్పుడు  ఈ తాగుబోతు రమేష్ కు నిశ్చితార్దం జరిగింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఫేస్ బుక్ లో ఫొటో పెట్టి అందరి బ్లెస్సింగ్స్ కోరారు. నటనతో ఆడియన్స్ నూ ఇండస్ట్రీని మెప్పించిన రమేష్ ఇప్పుడు ఒకింటి వాడు అవుతున్నాడు. అయితే ఆయన పెళ్ళి ఎప్పుడనే విషయం మాత్రం ఇంకా తెలుపలేదు. ఇండస్ట్రీలోని పెళ్ళికాని కుర్రాళ్ళంతా వరుసపెట్టి పెళ్ళిళ్ళు చేసుకోవడం 2015 ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ