శృతిహాసన్ హీరోయిన్ గా నాగార్జున, కార్తీల కాంబినేషన్ లో పివిపి వారు ఓ సినిమాని నిర్మిస్తున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయింది. అయితే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతున్నానని శృతి అనడంతో సదరు నిర్మాణ సంస్థ వారు శృతిహాసన్ పై సివిల్, క్రిమినల్ చర్యలకు సిద్ధపడుతున్నారు. అంత వరకు ఓకే అయితే ఈ ప్లేస్ ను ఎవరు రీప్లేస్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజాగా ఈ ప్లేస్ లో మిల్కి బ్యూటీ తమన్నాను తీసుకోవాలని యూనిట్ వారు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే...