తమన్నా కత్తి యుద్ధం...ఊహించగలమా?

June 10, 2015 | 04:11 PM | 0 Views
ప్రింట్ కామెంట్
tamanna_stunts_in_bahubali_niharonline

అవును మిల్కీ బేబీ... ఈ నాజూకు నడుం పాప కత్తి పడితే ఎలా ఉంటుంది? బాహుబలి పోస్టర్ల వరకు  చూశాం గానీ ఈ అమ్మడు ఇందులో కత్తి యుద్ధం చేస్తుందట... రాజమౌళి సినిమా అనేగానే గంతులేసి, ఉబ్బి తబ్బిబ్బయి పోయిందట కానీ, ప్రభాస్ తో కత్తి యుద్ధం అనేగానే నీరసించి పోయిందట... కత్తి పట్టుకోవడం కూడా రాని, ఈ మెరుపు తీగ ఇక యుద్ధం మేం చేస్తుంది. అది కూడా ఆరడుగుల ఆజానుబాహుడైనా బాహుబలితో చేస్తుందట. మొదట్లో భయపడిపోయిందట కానీ ప్రభాస్ చాలా సహకరించాడని చెప్పుకొచ్చింది. ఇక ఈ న్యూస్ చదివి తమన్నా కత్తి యుద్ధం కోసం వెళ్ళేవారు ఎంత మందో? అందుకే చెప్పిందా తమన్నా... ఏమో ఈ సినిమాలో ఏ న్యూస్ బయటికి వచ్చినా సినిమా ప్రమోషన్ కోసమేననిపిస్తుంది అందరికీ...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ