రంజాన్ సమయంలో ముస్లిం సోదరులకు రాజకీయ పార్టీలు ఇఫ్తార్ విందును ఏర్పాటుచేయడం సాధారణ విషయమే. అయితే ఇలయదళపతి విజయ్ ఇఫ్తార్ విందుని ఏర్పాటుచేసి ప్రశంసలందుకున్నారు. ‘పులి’షూటింగ్ పూర్తి చేసుకుని అట్లీ చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్న విజయ్ ఆదివారం చెన్నైలో మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఆహారపదార్థాలను తయారు చేయించి, విజయ్ స్వయంగా వడ్డించాడు. ముస్లింలతో కలిసి ఇఫ్తార్ విందును ఆరగించి వారికి రంజాన్ శుభాకాంక్షలను తెలిపాడు.