తమిళ స్టార్ హీరో విజయ్ ‘పులి’ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దాదాపు వందకోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. విజయ్ పుట్టిన రోజున విడుదలైన టీజర్ కి ఆడియెన్స్ నుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. తాజా సమాచారం ప్రకారం సన్ నెట్ వర్క్ వారు ఈ సినిమా తమిళ శాటిలైట్ హక్కులను భారీ రేటు చెల్లించి చేజిక్కించుకున్నారని సమాచారం. సుదీప్, శ్రీదేవి, శృతిహాసన్, హన్సిక ఇలా టాప్ స్టార్స్ అందరూ ఈ సినిమాలో ఉండటంతో సినిమాపై మంచి అంచనాలే నెలకొని ఉన్నాయి. తమిళంతో పాటు తెలుగులో కూడా ఒకే రోజున విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.