కామెడీ హర్రర్ కాన్సెప్ట్ తో తమిళంలో హిట్ కొట్టిన సినిమా ‘స్ట్రాబెరీ’. ఈ సినిమా పేరు వినగానే హరర్ సినిమా పిజా గుర్తుకు వస్తుంది. మరి ఈ సినిమా ఏ లెవెల్ లో భయపెడుతుందో తెలియదు గానీ, కాంచన సినిమాలో లా కామెడీ కూడా మెండుగా ఉందంటున్నారు. అక్కడ హిట్ అయిన సినిమాలపై మన తెలుగు వాళ్ళ దృష్టి ఉంటుంది కదా... అలాగే ఈ చిత్రం తెలుగు హక్కులను కొనేసుకున్నారు. ఈ సినిమా అనువాద హక్కులను సాయిరాం ఆర్ట్స్ ప్రొడక్షన్స్ సంస్థ తీసుకుంది. సురేష్ దూడల సమర్పణ. పా విజయ్ హీరోగా నటిస్తూ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ డైరెక్షన్ చేశారు. అవని మోడి హీరోయిన్. సముద్రఖని, దేవయాని ప్రధానపాత్రధారులు. కామెడి హర్రర్ కాన్సెప్ట్ తో ఈ సెప్టెంబర్ 11న 280కి పైగా థియేటర్స్‌లో ఈ సినిమా విడుదలై సూపర్‌హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుంది. బేబి అను ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. తమిళనాట జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా తీసినట్టు చెపుతున్నారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయడానికి నిర్మాత పి.సాంబశివరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి మాటలుః రాజశేఖర్ రెడ్డి, పాటలుః శివగణేష్, ఫైట్స్: రాకీ రాజేష్, సంగీతం: తజ్‌నూర్, కెమెరాః మార వర్మన్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: అలంక వేణు, నిర్మాతః పి.సాంబశివరెడ్డి, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పా విజయ్.