మెగా మేనల్లుడికి ఇప్పుడు సినిమా ఛాన్సులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయట. మేనమామల పోలికలు టాలెంట్ తో అచ్చంగా ఊడిపడ్డాడీ హీరో... కొత్తతనమేం లేకుండా ఫ్రీగానే నటిస్తున్నాడీ హీరో. మేనమామల పుషింగ్ ఏ మాత్రం ఉందో తెలియదుగానీ, ఒరిజినాలిటీ మాత్రం ఉందనే చెప్పాలి. ఇతడు కేవలం వన్ ఫిలిం వండర్ మాత్రమే. అయినా ఇప్పటికిప్పుడు ఇతడి కెరీర్లో రెండు క్రేజీ ప్రాజెక్టులు వచ్చి పడ్డాయి. ఒకటి ఆన్సెట్స్ ఉంది. వేరొకటి కథా చర్చల్లో ఉంది. మరికొన్ని స్క్రిప్టులు రెడీ అవుతున్నాయి. మెగా హీరో సాయిధరమ్ తేజ ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంలో నటించి ఒక్క సినిమాతోనే ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.. కుర్రాడిలో బోలెడంత విషయం ఉంది. అవకాశాలిస్తే తప్పేం కాదని దర్శకులంతా వెంటపడుతున్నారిప్పుడు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో నటిస్తున్నాడు. అది సెట్స్ లో ఉండగానే 'ఓం 3డి' డైరెక్టర్ అనీల్ రెడ్డి ఓ కథ చెప్పి ఒప్పించాడు. మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్లాన్ చేస్తున్నారు. 40 రోజుల షూటింగుకి రెడీ అవుతున్నాడు. వరుసగా ఒకదాని వెంట ఒకటిగా అవకాశాలొస్తున్నాయి. పెద్ద డైరెక్టర్ల సినిమాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాడట. తన కజిన్స్ రాంచరణ్, అల్లు అర్జున్ లకు ఏమాత్రం తీసిపోడని ఇండస్ట్రీలో టాక్ తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ.