తమిళ పాటల రచయిత తామరై మంగళవారం చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈమె తన భర్త త్యాగు తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ బహిరంగ పోరాటం చేశారు. ఆమె స్థానిక నుంగంబాక్కంలో గల వళ్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేసి సంచలనం రేపారు. చివరికి కొందరు పెద్దలు కల్పించుకుని తామరైతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించారు. భర్త త్యాగు తామరైతో కలిసి జీవించడానికి సమ్మతించారు. ఇలాంటి పరిస్థితిలో తామరై సోమవారం పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. దీని గురించి మాట్లాడుతూ తనకు బెదిరింపు ఫోన్‌కాల్స్ వస్తున్నాయన్నారు. ఫేస్‌బుక్‌లోను అసభ్య పద జాలాలతో బెదిరిస్తున్నారని తెలిపారు. అదే విధంగా కొందరు ఆగంతుకులు తన ఇంటి వద్ద తచ్చాడుతున్నారని వారెవరో ఎందుకు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారో విచారేందుకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.