తాప్సి హీరోయిన్ గా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు. గంగ హిట్ అయినప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తాయన్న నమ్మకం కుదరనట్టుంది. అందుకే ఇక లాభం లేదనుకుందేమో ఏదైనా బిజినెస్ చేద్దామనుకుంది. ఇప్పటికే చాలా మంది తారలు ఎవర్ గ్రీన్ బిజినెస్ అంటూ నగలు, బట్టల బ్రాండ్ కంపెనీలు మొదలు పెట్టేశారు. అందుకే తాప్సీ కూడా తనూ బిజినెస్ లో దూకబోతోంది. వెడ్డింగ్ ప్లానింగ్ అంటే మొదటి నుంచీ తనకు ఇంట్రెస్ట్ ఉండడంతో తాప్సీ తన చెల్లెలు షగున్, స్నేహితురాలు ఫరాతో కలిసి వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ లాంఛ్ చేస్తోంది. తనకి ఈ రంగం మీద ఆసక్తి ఉందని, తన స్నేహితురాలు ఫరాకి ఇందులో అనుభవం ఉందని, అందుకే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నానని, వెంటనే తను యాక్టివ్ కాకపోయినా కానీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటానని, తర్వాత ఈవెంట్ మేనేజ్‌మెంట్ కూడా స్టార్ట్ చేస్తామని అంటోంది. తను సినీ రంగంలోనూ డైరెక్షన్ అంటే ఇష్టం ఉండడంతో ఆ దిశగా కూడా ఆలోచిస్తోంది. మొత్తానికి హీరోయిన్లు తమకు ఇండస్ట్రీ ఇక లాభం లేదనుకున్నప్పుడు భవిష్యత్ ప్రణాళిక ఏదో ఒకటి ఆలోచించడం మంచిదే కదా...