నా సినిమాలన్నీ జయంతో పోల్చడం టార్చర్... తేజ

July 31, 2015 | 12:29 PM | 2 Views
ప్రింట్ కామెంట్
director_teja_hora_hori_audio_niharonline

దర్శకులకు సినిమా తీస్తున్నప్పుడు బాగా చేయాలన్న టెన్షన్... తీరా ఇంత కష్టపడి రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యాక... రిలీజయ్యాక మరో టెన్షన్ విమర్శకుల మాటలు విన్నప్పుడు కాస్త ఇరిటేటింగ్ గా కూడా ఉంటుందనేది వాస్తవం... అవే విషయాలు తేజ మనసు విప్పి చెప్పారు. తను తీసిన హోరాహోరీ సినిమా ఆడియో పంక్షన్ లో ఆయన మాట్లాడుతూ... పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో కొత్తదనమన్నది కనిపించకుండా పోయిందన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. బాగా హిట్ అవుతున్న పెద్ద సినిమాలన్నీ ఒకే మారిదిరిగా ఉంటున్నాయన్నారు. ఆ సినిమాలన్నీ జనాలు బాగా హిట్ చేస్తున్నారు కూడా అన్నారు. మరి నేనెప్పుడు కొత్త సినిమా తీసినా, ‘ఏమైనా జయం స్థాయిలో ఈ సినిమా లేదు సార్' అంటారు. అదే జయం సినిమాలోని ఏ ఒక్క సన్నివేశం వేరే సినిమాలో యాధృచ్చికంగా వచ్చినా, ‘మళ్ళీ జయం తీశాడ్రా' అంటారు. అసలు నన్నడిగితే ఈ మధ్య కాలంలో తెలుగులో ఘనత చాటుకున్న పెద్ద సినిమాల్లో ఏముంది? ఒక రెండు కథలుంటాయి. వాటినే గత పదేళ్ళుగా తీస్తూ వస్తున్నారు. అవే కథలు తిప్పి తిప్పి తీసినా ఫరవాలేదు కానీ, నేను మాత్రం ‘జయం' చేయకూడదా?" అంటూ వ్యాఖ్యానించారు తేజ. తరువాత సరదాగా అంటున్నాను. ఈ సినిమా జయంలా లేదు ఉండదు అన్నారు. అలాగే.. ''హోరా హోరీ' ప్రచార చిత్రం చూసినవాళ్లంతా 'జయం'తో పోలుస్తుంటే ఆ సినిమా ఎందుకు తీశాన్రాబాబూ అనిపిస్తోంది. నా జీవితం 'జయం'తో మొదలై, దాంతోనే అంతమైపోయినట్టు మాట్లాడుతున్నారు. నేను ప్రేమకథలతో పాటు అన్నిరకాల సినిమాలూ తీశా. కానీ ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా ముద్ర వేశారు అన్నారు. 
ఇంకా తను తీసిన  'హోరా హోరీ' గురించి మాట్లాడుతూ సినిమా కోసం మేం రెయిన్‌ మెషీన్‌ తయారు చేశాం. లైట్లు వాడకుండా సినిమా తీశాం. నటీనటులెవరూ మేకప్‌ వేసుకోలేదు. నాతో పనిచేయడం ఓ టార్చర్‌ లాంటిది. కల్యాణి కోడూరు నేనూ చాలాసార్లు తగాదా పడ్డాం. కానీ తను మంచి పాటల్ని ఇచ్చాడు'' అన్నారు  చివరిగా పాటల గురించి మాట్లాడుతూ...

director-teja-sensational-speech-at-hora-hori-audio-launch-047117.html

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ