‘ఆడపిల్లనమ్మా... ఆడపిల్లనాని’ అంటూ పదేళ్ళ క్రితం బుల్లి తెర ప్రేక్షకులను తన గానంతో కంట తడి పెట్టించిన గాయని మధుప్రియ ఈ రోజు వివాహం చేసుకుంది. ఈ వివాహం ఇరువైపు పెద్దలనుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆరునెలల తర్వాత కోరుకున్నవాడితో పెళ్లి చేస్తామని పెద్దలు చెప్పినప్పటికీ ఆమె ఆమె వినకుండా ఈ పెళ్ళి చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో పోలీసులు ఇటు మధుప్రియ, అటు శ్రీకాంత్ ఫ్యామిలీ సభ్యులకు కౌన్సెలింగ్ చేసినప్పటికీ ఫలితం లేదంటున్నారు. ఈ మధ్యాహ్నం వివాహం జరిగిపోయింది. ఈ కార్యక్రమానికి వరుడు శ్రీకాంత్ కుటుంబసభ్యులు హాజరైనా, మధుప్రియ ఫ్యామిలీ మెంబర్స్ దూరంగా వున్నారని తెలుస్తోంది. అయితే మధు ప్రియ మాట్లాడుతూ ఈ పెళ్ళికి సంబంధించి చిన్న సమస్యలు ఉన్నాయని, అయినా ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారని చెపుతోంది. తమను అభిమానించే అందరూ ఆశీర్వదించాలని కోరుకుంది. కానీ అబ్బాయి గురించిన వివరాలేమీ తెలుప లేదు.