ఘంటసాలపై టెలీ ఫిలిం

December 06, 2014 | 03:37 PM | 24 Views
ప్రింట్ కామెంట్

తెలుగు పాట ఉన్నంత కాలం ఘంటసాల పాట వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చనిపోయి 40 ఏళ్ళవుతున్నా ఆయన పాటలు మాత్రం అందరికీ వీనులవిందులవుతున్నాయి. డిసెంబర్ 4న ఘంటసాల పుట్టిన రోజు. ఆ రోజున ఘంటసాల జీవిత కథతో టెలీ ఫిలిం రూపొందించనున్నారు. గాయకులు కావాలనుకునే వారందరికీ ఆయన పాటలే గ్రంథాలయం. ఘంటసాల జీవిత కథ ఆధారంగా ఇప్పటికే చాలా పుస్తకాలు వచ్చాయి. ఇప్పుడు ఓ టెలీం ఫిలింను 555 పాటలతో 828 పేజీలతో ‘ ఘంటసాల పాటశాల ’ అనే అపురూప గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందించిన ఘంటసాల వీరాభిమాని సీహెచ్‌ రామారావు ఏడాది పాటు శ్రమించి, పరిశోధించి ‘ ఘంటసాల స్ర్కిఫ్ట్‌ ఆధారంగా ఈ టెలీ ఫిలిమ్‌ రూపొందనుంది. పలు టెలీ ఫిలింస్‌, డాక్యుమెంటరీస్‌ రూపొందించి నంది అవార్డులు గెల్చుకున్న కర్రి బాలాజీ ‘ ఘంటసాల ’ టెలీ ఫిలిమ్‌కి దర్శకత్వం చేయనున్నారు. ‘ సుందరకాండ, కొండపల్లి రాజా, సుకుమారుడు ’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సీనియర్‌ నిర్మాత కేవీవీ సత్యనారాయణ సమర్పణలో శ్రీ సౌదామిని క్రియేషన్స్‌ పతాకంపై వేణు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బండ్ల బ్రహ్మాస్వామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు పీజీ విందా, సీనియర్‌ ఎడిటర్‌ గౌతంరాజు, యువ సంగీత దర్శకుడు మహిత్‌ ఈ టెలీం ఫిలింకు పనిచేయనున్నారు. దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ..ఘంటసాల జయంతి రోజైనా డిసెంబర్‌ 4న చిత్రీకరణ ప్రారంభిస్తాం. కృష్ణాజిల్లా, విజయనగరం, చెన్నై, హైదరాబాద్‌లలో చిత్రీకరణ చేస్తాం. ఘంటసాల పాత్రను ఓ ప్రముఖ రంగస్థ్థల నటుడు పోషించనున్నారు. ఇతర తారాగణం ఎంపిక కూడా పూర్తయింది. 45 నిమిషాల నిడివి గల ఈ టెలీం ఫిలిమ్‌ ఘంటసాల వర్థంతి సందర్భంగా వచ్చే ఫిబ్రవరి 11న ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతుందని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ