ఐ లవ్ యూ రస్నా అంటూ చిన్నప్పుడు యాడ్ లో సందడి చేసిన అంకిత ఆ తర్వాత నటిగా గుర్తింపు పొందింది. లాహిరి లాహిరి లాహిరిలో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ ఆ తర్వాత సౌత్ లోని అన్ని భాషల్లో దాదాపు నటించింది. ముఖ్యంగా సింహాద్రి ధనలక్ష్మి ఐ లవ్ యూ చిత్రాలతో ఆమె భాగా పాపులర్ అయ్యింది. బాలకృష్ణతో విజయేంద్ర వర్మ చిత్రంలో కూడా నటించింది. చివరగా వినాయకుడు చిత్రంలో ఓ గెస్ట్ రోల్ చేసి ఆ తర్వాత సినిమాలకు పుల్ స్టాప్ పెట్టింది. అవకాశాలు తగ్గడంతో యూఎస్ వెళ్లిపోయింది. అక్కడ హాలీవుడ్ స్టూడియోలో ఫిలిం టెక్నాలజీ కోర్స్ చేసింది. అంతేగాక కొంతమంది హాలీవుడ్ దర్శకుల వద్ద కూడా పనిచేసింది.
తాజాగా ఈ అమ్మడికి పెళ్లి కుదిరింది. న్యూజెర్సీకి చెందిన ఎన్నారై, జెపి మోర్గాన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ విశాల్ జగ్తాప్ తో ముంబైలోని మారియట్ హోటల్ లో పెద్దల సమక్షంలో అంకిత నిశ్చితార్థం శుక్రవారం జరిగింది. త్వరలోనే వారి వివాహం జరగనన్నట్లు సమాచారం. మరి పెళ్లి తర్వాత ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఉంటుందో, ఉండదో మాత్రం చెప్పలేదు.