ఇప్పటి భారత ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సినీతారలను ఉపయోగించుకోవడమే ట్రెండ్ ను అనుసరిస్తోంది. స్వచ్ఛ భారత్ లో చాలా మంది సినీ తారలను ఇప్పటికే ఉపయోగించుకుంటోంది. ఆ తారలను ఎప్పటికప్పుడు తమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులను చేసేందుకు వారితో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటోంది. అందులో భాగంగానే నిన్న భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి పలువురు తారలను తన రాష్ట్రపతి భవన్ కు ఆహ్వానించి తేనీటి విందును ఏర్పాటు చేశారు. వీరంతా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరిస్తున్న వారు కావడం విశేషం.
నిన్న రాష్ట్రపతి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పబ్లిషర్, నిర్మాత అయిన రామోజీ రావు, నటుడు కమల్ హాసన్, సోషల్ సర్వీస్ చేసే అమల అక్కినేని, లక్ష్మీ మంచు, ఫేమస్ హీరోయిన్ తమన్నాలతో పాటు నేషనల్ అవార్డు విన్నర్ అయిన గీత రచయిత సుద్దాల అశోక్ తేజ కూడా పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి తక్కువ ఖర్చుతో ఎలాంటి డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేయాలి, ఇండియాలోని సిటీ, టౌన్స్, గ్రామాలలో అన్ని రకాల వసతులతో పాటు వాతావరణాన్ని కలుషితం కాకుండా చేసే పనులను మొదలు పెట్టాలని ఆయన పిలుపునిచ్చాడు. ఈ విషయంలో పబ్లిక్ ఎట్రాక్షన్ అయిన నటీనటుల సహాయం అందించాలని ఆయన కోరారు. పారిశుద్ధ్యం పాటించేలా ప్రచార కర్తలు ప్రజలను ప్రభావితం చేయాలని ఆయన కోరారు.