టాలీవుడ్ మన్మథుడు ఎవరంటే ఆరు పదుల వయసు దగ్గరపడుతున్నప్పటికీ అక్కినేని నాగార్జున అనే చెప్పుకుంటాం. వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ ఆయన ముఖవర్చస్సు ఇప్పటికీ కుర్రహీరోలకి ఏ మాత్రం తీసిపోలేదన్నది ఒప్పుకోవాల్సిందే. స్టైల్ లో కూడా యూత్ కి ఇప్పటికీ రోల్ మోడల్ గానే ఆయన ఉన్నాడు. మరి ఇప్పుడు తెలుగులో మరో నవ మన్మథుడు వచ్చేస్తున్నాడు. ఇంతకీ ఎవరంటారా?
అతగాడేవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్. కాస్తా షాక్ కి గురయినప్పటికీ ఇది నమ్మండి. త్వరలో ఇతగాడు తంగమగన్ అనే ఓ చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. ఇది గతంలో అతని హిట్ సినిమా వీఐపీ కి సీక్వెల్. ఆ చిత్రం రఘువరన్ బీటెక్ పేరుతో తెలుగులో కూడా డబ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. దీంతో ఈ సీక్వెల్ ను కూడా తెలుగులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఇక ఆ చిత్రానికి నవ మన్మథుడు అనే టైటిల్ ను ఫిక్స్ చేసి పడేశారు. తమిళంలో ఈ చిత్రం డిసెంబర్ 18న విడుదల కానుంది. తెలుగులో కూడా అదే రోజు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారంట. కాకపోతే చెన్నై వరదల కారణంగా ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ధనుష్ సరసన సౌత్ డాల్ సమంతా, అమీ జాక్సన్ లు జత కడుతుండగా , కేఎస్ రవికుమార్, రాధికా శరత్ కుమార్ లు ధనుష్ తల్లిదండ్రులుగా నటిస్తున్నారు.