ఇటీవల తెలుగులో హీరోయన్లకు కరువైనట్టే అనిపిస్తోంది. ప్రతి కొత్త సినిమాకు హీరోయిన్ ఎంపికకు కాస్త టైమ్ తీసుకుంటున్నారు. పాత హీరోయిన్లకేమో క్రేజ్ తగ్గడంతో పాటు, వారి రెమ్యునరేషన్ డిమాండ్ కూడా పెరిగిపోయింది. దీంతో ఇటీవల సినిమాల్లోకి ఎంటర్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కు డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ఒకే సినిమాతో రేటు పెంచేస్తున్న ఆశపోతు హీరోయిన్ల కంటే ఈ అమ్మడు కాస్త నయమేననిపిస్తుంది. రకుల్ కు వరుసగా మూడు హిట్లొచ్చాయి. ప్రస్తుతం ఈమెను గోల్డెన్ లెగ్ గానే భావిస్తున్నారందరూ. మరి రెమ్యునరేషన్ పెంచెయ్యదా? ఈమె రేటిప్పుడు 70 లక్షలట. ఎన్టీఆర్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు కమిట్ అయ్యింది ఈ చిన్నది. దానికి గాను డెబ్బై లక్షలు అడిగిందని సమాచారం. ఇలా మరో రెండు హిట్లు కొడితే తెలుగులో ఈవిడే నెంబర్ వన్ అయినా ఆశ్చర్యపోనక్కరలేదు.