ఒక సినిమాకు నిర్మాతలు, ఇతర టెక్నీషియన్లు ఎందరైనా ఉండొచ్చేమో గానీ డైరెక్టరు మాత్రం ఒక్కరే ఉంటారు. ఒక వేళ సినిమా మధ్యలో ఏదైనా గొడవ జరిగితే వేరే డైరక్టర్ వచ్చి ఆ సినిమాను పూర్తి చేస్తాడు. అజిత్ సినిమాకు మాత్రం డైరెక్టర్ ఉండగానే ఆయన అనుమతితో మరో ఇద్దరు డైరెక్టర్లు పని చేస్తున్నారు. అజిత్ హీరోగా నటిస్తున్న 'ఎన్నై అరిందాల్' చిత్రానికి ముగ్గురు దర్శకత్వం వహిస్తున్నట్టు ఓ సమాచారం. ఈ చిత్ర ప్రధాన దర్శకుడు గౌతం మీనన్ ఈ చిత్రాన్ని త్వరగా పూర్తిచేసే పూర్తి చేయాలనే ఉద్దేశంతో తనతో పాటు దర్శకులు శ్రీధర్ రాఘవన్, త్యాగరాజ కుమారరాజలను కూడా ఈ సినిమాకు ఇన్ వాల్వ్ చేయించాడట. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ- '' ఇది ఎప్పటిలాగానే నాకోసం తయారైన చిత్రంలా ఉండకూడదు. ప్రత్యేకించి గౌతమ్ మీనన్ తరహాలో రూపొందించిన సినిమాలా కనిపించాలన్నదే నా అభిమతం''అన్నారు. తెలుగులో ఈ చిత్రం ‘ఎంతవాడుగానీ' అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.