తిరిగి టాలీవుడ్‌కి ‘శ్వేతాబసు’

December 06, 2014 | 05:04 PM | 29 Views
ప్రింట్ కామెంట్

సెక్స్‌ రాకెట్‌ కేసులో అరెస్టయి, రెస్క్యూహోంలో రెండు నెలలు గడిపి విడుదలైన నటి శ్వేతాబసు మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి టాలీవుడ్‌లో తిరిగి తెరంగేట్రం చేయబోతోందని తెలుస్తోంది. ఆల్రెడీ డైరెక్టర్‌ తేజ ఆమెకు తన... అప్‌కమింగ్‌ ప్రాజెక్టులో రోల్‌ ఇస్తానని కన్‌ఫామ్‌ చేసేశాడట. ఈయనే గాక, ఇతర ప్రొడ్యూసర్లు కూడా శ్వేతకు ఆఫర్స్‌ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం శ్వేత ముంబైలో బాలీవుడ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ కశ్వప్‌ మూవీకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉంది. పైగా భారతీయ సంగీతంపై %షష%రూట్స్‌%% పేరిట నిర్మించే డాక్యుమెంటరీ సన్నాహాల్లో నిమగ్నమై ఉంది. ఇప్పుడది పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉందని సమాచారం. విశాల్‌ భరద్వాజ్‌, ఎ.ఆర్‌. రెహమాన్‌ వంటి ప్రముఖులతో కూడిన ఇంటర్వ్యూలు ఈ డాక్యుమెంటరీలో ఉంటాయట ! అటు. తిరిగి హైదరాబాద్‌ చేరుకుని తన టాలీవుడ్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించేందుకు శ్వేత కూడా ఉత్సాహంగా ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ