హీరోగా మొదటి చిత్రం ఈ మధ్యే సెట్స్ మీద కెళ్లింది. అప్పుడే ట్యాగ్ లైన్ తగిలించేశారు. తగిలిస్తే తగిలించారు కానీ మా హీరో టైటిల్ ను ఎందుకు పెట్టారంటూ మహేష్ ఫ్యాన్స్ అఖిల్ మీద గరంగరంగా ఉన్నారు. ఈ మధ్య మెగాబ్రదర్ తనయుడు వరుణ్ తేజ్‌ని 'మెగా ప్రిన్స్' అంటూ చిరంజీవి అభివర్ణించడమే మహేష్ అభిమానులకి నచ్చలేదు. తమ హీరో టైటిల్ ముందు మెగా అని తగిలించేసారని తెగ ఫీలైపోయారు. ఇక అది చాలదన్నట్టు అఖిల్ ను ఏకంగా ప్రిన్స్ అని సంబోధించటంతో వారికి ఎక్కడో కాలిపోతుంది. ప్రస్తుతానికి మహేష్ సూపర్‌స్టార్ గా చెలామణి అవుతున్నప్పటికీ ఇంకా చాలా మంది ప్రిన్స్ అనే పిలుస్తున్నారు. పైగా మహేష్ తర్వాత ఆ టైటిల్ తనయుడు గౌతం కే నని మెంటల్ గా ఫిక్సయ్యారు. కానీ ఇక్కడ అక్కినేని అభిమానులు ఓ లాజిక్ పాయింట్ ను లాగారు. నాగార్జున టాలీవుడ్ కి కింగ్ కాబట్టి ఆయన తనయుడు అఖిల్ ప్రిన్స్ అవుతాడని ఢంకా బజాయిస్తున్నారు. నాగార్జున పాత టైటిల్ యువ సామ్రాట్‌ని నాగచైతన్యకి ఇవ్వడంతో రెండో కొడుకు అఖిల్ ప్రిన్స్ అని వారు ఫిక్సయిపోయారు. లాజికే కదా...